‘సిరివెన్నెల’గా ప్రియమణి
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియణి తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏఎన్బి కోర్డినేటర్స్ ఏఎన్ భాషా రామసీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న సిరివెన్నెల చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది. తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే సిరివెన్నెల సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ సిరివెన్నెల కథ బాగా నచ్చడం పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు, జూనియర్ మహానటిగా మంచి పేరుతెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.













