Priyadarshi: కమర్షియల్ హీరోకి కొత్త అర్థం చెప్పిన ప్రియదర్శి
ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే మరోవైపు మంచి స్టోరీ ఉంటే హీరోగా అలరిస్తున్నాడు ప్రియదర్శి(Priyadarshi). మల్లేశం(Mallesham), బలగం(Balagam) మూవీలతో నటుడిగా తన సత్తా చాటిన ప్రియదర్శి ఇప్పుడు ఇప్పుడు నాని నిర్మాతగా కోర్టు(Court) మూవీ చేశాడు. మార్చి 14న కోర్టు ఆడియన్స్ ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
కోర్టు సినిమాతో ఎవరికీ ఎలాంటి మెసెజ్లు ఇవ్వట్లేదని, పోక్సో చట్టమంటే ఏంటో, ఏ సందర్భంలో దాన్ని పెడతారు? అన్యాయంగా ఆ కేసులో ఇరుక్కున్న అబ్బాయిని న్యాయ వ్యవస్థ ఎలా కాపాడిందనే నేపథ్యంలో కోర్టు కథ తెరకెక్కిందని, ఈ సినిమా కోసం తాను ఎంతో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసినట్టు ప్రియదర్శి తెలిపాడు.
తానేమీ గొప్ప స్టార్ ను కాదని చెప్పిన ప్రియదర్శి, మంచి సినిమాలు చేస్తేనే ఎవరైనా చూస్తారని, లేకపోతే థియేటర్ల వరకు ఎవరూ రారని తాను చేసిన డార్లింగ్(Darling) మూవీతో ఈ విషయం తనకు బాగా అర్థమైపోయిందని, మనం చేసిన సినిమాకు పెట్టిన డబ్బులు కంటే రెట్టింపు వసూళ్లు వచ్చాయంటే మనం కమర్షియల్ హీరోనే అని కమర్షియల్ హీరోకు కొత్త అర్థం చెప్పాడు ప్రియదర్శి.













