Lucifer: లూసిఫర్ పృథ్వీరాజ్ చేయాల్సింది కాదట!
మోహన్ లాల్(Mohan Lal) హీరోగా పృథ్వీరాజ్(Prithviraj) దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్(Lucifer) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్(L2:Empuraan) తెరకెక్కింది. నిజానికి లూసిఫర్ సినిమాను మోహన్ లాల్ అనుకుంది వేరే డైరెక్టర్ తో కానీ కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ లైన్ లోకి వచ్చాడు. 2012లో లూసిఫర్ అనే టైటిల్ తో డైరెక్టర్ రాజేష్ పిళ్లై(Rajesh Pillai), రైటర్ మురళీ గోపి(Murali Gopi) ఓ స్టోరీని రెడీ చేసి, మోహన్ లాల్ హీరోగా, ఆంటోనీ పెరంబవూర్(Anthony Perambavur) నిర్మాతగా మూవీని ఓకే చేసుకుని మోహన్ లాల్ కు కథ కూడా చెప్పి ఓకే చేసుకుని సినిమాను అనౌన్స్ చేశాడు.
ఆ మూవీ కోసమే లూసిఫర్ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. కానీ రాజేష్ పిళ్లై కుంచకోబోబన్(Kunchako boban) హీరోగా మోటార్ సైకిల్ డైరీస్(Motor cycle dairies) సినిమాను మొదలుపెట్టడంతో ఆ ఏడాది లూసిఫర్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. 2014లో లూసిఫర్ ను స్టార్ట్ చేద్దామంటే అనివార్య కారణాల వల్ల స్క్రిప్ట్ ఇంకా పూర్తవలేదు. జులై నుంచి మురళీ గోపీ ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడం మొదలుపెట్టారు. అదే టైమ్ లో రాజేష్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కొన్నాళ్ల పాటూ లూసిఫర్ ను పక్కన పెట్టారు.
అనుకోకుండా 2016 ఫిబ్రవరిలో రాజేష్ పిళ్లై మరణించడంతో లూసిఫర్ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. అయితే రాజేష్ పిళ్లై చనిపోయాక కూడా మురళీ గోపీ లూసిఫర్ కోసం వర్క్ చేస్తున్నట్టు చెప్పడంతో సరిగ్గా 3 నెలలకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా లూసిఫర్ మూవీని ప్రకటించారు. అయితే రాజేష్ పిళ్లై తీయాలనుకున్న లూసిఫర్ స్టోరీ, పృథ్వీరాజ్ తీసిన లూసిఫర్ స్టోరీ వేరు వేరని కేవలం ఆ టైటిల్ ను మాత్రమే తాము వాడుకున్నామని పృథ్వీరాజ్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఒకరు చేయాల్సిన సినిమా వేరే వాళ్లు తీసి దాంతో సూపర్ హిట్ అందుకున్నారు మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్.













