సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రేమపిపాసి
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ప్రేమపిపాసి. మురళీరామస్వామి(ఎమ్ఆర్) దర్శకుడు. రాహుల్భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మస్ పతాకాలపై పి.ఎస్.రామకృష్ణ (ఆర్కె) నిర్మిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రేమ కమర్షియల్‌గా మారిపోయింది. నిజమైన ప్రేమ గొప్పతనాన్ని ఓ యువకుడు ఎలా చాటిచెప్పాడన్నది ఆకట్టుకుంటుంది. దర్శకుడు మారుతి విడుదల చేసిన ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచే చిత్రమిది అని తెలిపారు. సెన్సార్ పూర్తయింది, ఎ సర్టిఫికెట్ లభించిందని, మంచి సినిమా చూశామంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసించడం ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. జ్యోతిరాజ్పుత్, మమతశ్రీచౌదరి, అంకిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం తిరుమల రోడ్రిగ్జ్.













