రణ్వీర్- ప్రశాంత్ గొడవ.. అసలు విషయమేంటంటే
హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తర్వాత దానికి కొనసాగింపుగా జై హనుమాన్ ను తీస్తానని ప్రశాంత్ వర్మ ముందే చెప్పాడు. కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా బ్రహ్మ రాక్షస అనే సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదలుపెట్టాడు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నాడని, ప్రశాంత్ వర్మ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సే దీనికి కారణమని అందుకే హీరో తిరిగి ముంబై వెళ్లాడని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తాజాగా ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. ఇప్పటికే నిర్మాతలు హీరో రణ్వీర్ సింగ్కి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి భారీ అడ్వాన్స్ ఇచ్చారు. ఉన్నట్టుండి హీరోగా రణ్వీర్ తప్పుకుంటే మరో స్టార్ హీరోని తీసుకురావడానికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ విషయంలో నిర్మాతలే కలుగచేసుకుని హీరో, డైరెక్టర్ మధ్య ఇష్యూని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. ప్రశాంత్ వర్మ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మళ్లీ రణ్వీర్ తో టై అప్ అవడానికి రెడీగా ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.













