మాస్ హీరోతో ప్రశాంత్ వర్మ మూవీ
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నెక్ట్స్ సంక్రాంతికి తన నుంచి జై హనుమాన్ రిలీజ్ కానుందని కూడా ఆ చిత్ర ప్రమోషన్స్ లో చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి రణ్వీర్ సింగ్ తో ఓ సూపర్ హీరో సినిమా చేయాలనుకున్నాడు. అంతా అయిపోయింది ఇక సినిమా సెట్స్ కు వెళ్లడమే లేటనుకుంటున్న టైమ్ లో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తో ప్రశాంత్ వర్మ సినిమా కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తోంది.
హనుమాన్ సినిమాలో ఓ కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చన విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన బ్యాక్ స్టోరీతో ప్రశాంత్ వర్మ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. రవితేజకు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా కూడా రూపొందనున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవమెంతన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ తెలియదు.













