మరో ఐదేళ్ల పాటూ బిజీగా నీల్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) వచ్చే ఐదేళ్ల వరకు బిజీగా ఉండేలా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం స్టార్ హీరో డేట్స్ దొరకాలంటే ఏడాది లేదా రెండేళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే అగ్ర హీరోలకు ముందే కథ చెప్పి సినిమాలను లాక్ చేసుకున్నాడు నీల్. ప్రస్తుతం నీల్, ఎన్టీఆర్(NTR) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.
2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మరోవైపు ప్రభాస్(Prabhas) తో సలార్2(salaar2) ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమాకు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవడంతో ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చు. 2027 సమ్మర్‌కు సలార్2 రిలీజయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
వీటితో పాటూ కెజిఎఫ్3(KGF3) స్క్రిప్ట్ ను కూడా నీల్ ఇప్పటికే రెడీ చేసుకున్నాడు. డైలాగ్ వెర్షన్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఆ సినిమాకు ఎంత లేదన్నా ఏడాదిన్నర పడుతుంది. ఇవి కాకుండా నీల్ తాజాగా రామ్ చరణ్(Ram Charan) తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో రానున్న ఈ సినిమా 2029 లేదా 2030లో మొదలయ్యే ఛాన్సుంది. ఇలా వరుస సినిమాలతో నీల్ రానున్న ఐదేళ్లలో చాలా బిజీగా ఉండబోతున్నాడు.













