Prakash Raj: కోటా సినిమాలు చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా

కన్నడ నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్(prakash raj) వల్ల తనకు అవకాశాలు తగ్గుతున్నాయని, తన ఛాన్సులన్నీ ప్రకాష్ రాజ్ కు వెళ్తున్నాయని ఎన్నో సార్లు అతన్ని డైరెక్ట్ ఎటాక్ చేశారు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa rao). మూడేళ్ల కిందట జరిగిన మా(MAA) ఎలక్షన్స్ టైమ్ లో కూడా ప్రకాష్ రాజ్ పై కోటా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరికీ అసలు పడదని అంతా అనుకున్నారు. కానీ కోటాకు నివాళులర్పించడానికి వచ్చిన ప్రకాష్ రాజ్, ఆయన గురించి మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాకముందు కోటా సినిమాలు చూసి తానెంతో నేర్చుకున్నానని, యాక్టింగ్ పై ఆయనకున్న పట్టు, తననెంతో ఇన్‌స్పైర్ చేసిందని, టాలీవుడ్ లోకి వచ్చాక 20 సంవత్సరాల అనంతరం ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కిందని చెప్పిన ప్రకాష్ రాజ్, కోటా చాలా విశిష్టమైన వ్యక్తి అని, అందుకే ఆయన అందరికీ నచ్చరని తెలిపారు.
ప్రకాష్ రాజ్ వేరే భాషకు చెందిన యాక్టర్ కదా అని ఎవరో ఆయన దగ్గర ప్రస్తావిస్తే ప్రకాష్ తెలుగు నేర్చుకుని తెలుగు వాడు అయిపోయాడని, తనపై ఆయనెన్నో సెటైర్లు వేసేవాడని, కానీ వాటన్నింటినీ తాను సరదాగానే తీసుకునేవాడినని ప్రకాష్ తెలిపారు. గతేడాది తాను, బ్రహ్మానందం(Brahmanandam), అలీ(Ali), బ్రహ్మాజీ(Brahmaji) కలిసి ఓ షూటింగ్ లో పాల్గొన్నామని, ఆ టైమ్ లో కోటా గుర్తొచ్చారని, ఆయనకు ఆరోగ్యం బాలేని విషయం తెలిసి ఫోన్ చేసి మాట్లాడానని, వీలుంటే సెట్ కు రమ్మని అడిగి వెహికల్ పంపిస్తే సెట్స్ కు వచ్చి సరదాగా గడిపారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. దీంతో కోటాకు, ప్రకాష్ రాజ్ కు మధ్య ఎలాంటి క్లాషెస్ లేవని క్లారిటీ వచ్చేసింది.