Pragya Jaiswal: ట్రెడిషనల్ డ్రెస్‌కు ప్రగ్యా గ్లామర్ టచ్
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఓ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో సంప్రదాయ లుక్ కు వెస్ట్రన్ టచ్ ఇస్తూ గ్లామర్ ను మిక్స్ చేసి ప్రగ్యా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయడం లేదు. ఈ ఫోటోల్లో ప్రగ్యా అందాలను చూసి నెటిజన్లకు మతి పోతోంది. ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.













