Prabhas: నెట్టింట వైరలవుతున్న ప్రభాస్ మోహన్‌బాబు వీడియో
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటితో పాటు కన్నప్ప(Kannappa)లో ప్రభాస్ కీలక పాత్ర చేస్తున్నాడు. మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్న ఈ మూవీలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
మోహన్ బాబు, మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్(Kajal) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ముంబైలో టీజర్ ప్రైవేట్ స్క్రీనింగ్ జరగ్గా దానికి అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రభాస్, మోహన్ బాబు కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో ప్రభాస్, మోహన్ బాబు తమ ముక్కు గురించి మాట్లాడుకున్న మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియోలో ప్రభాస్ మోహన్ బాబుతో మాట్లాడుతూ మీ ముక్కు షార్ప్ గా ఉంది కానీ నాది అంతకంటే షార్ప్ గా ఉందని, చిన్నప్పుడు ఆ ముక్కుతో టమోటాలు కట్ చేసే వాడినని చెప్పి తన స్టైల్ లో నవ్వుతూ పక్కకెళ్లిపోయాడు. ఈ వీడియో మొత్తాన్ని విష్ణు తన ఫోన్ లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.













