Prabhas vs Ranveer Singh: రాజా సాబ్ తో పోటీ పడనున్న రణ్‌వీర్ సింగ్

బాహుబలి(baahubali) సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) క్రేజ్ బాగా పెరిగింది. అందుకే ఆయన సినిమాలన్నింటికీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, మారుతి(maruthi) దర్శకత్వంలో చేస్తున్న ది రాజా సాబ్(the raja saab) సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది.
ఎన్నో వాయిదాల తర్వాత రాజా సాబ్ ను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో డిసెంబర్ 5న కొత్త రికార్డులు సృష్టించబోతున్నామని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్న టైమ్ లో ఆ ఆశలపై రణ్‌వీర్ సింగ్(Ranveer singh) నీళ్లు చల్లాడు. రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న కొత్త సినిమా ధురంధర్(dhurandhar) ను కూడా డిసెంబర్ 5నే రిలీజ్ చేయనున్నట్టు ఆ చిత్ర మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
ఆదిత్య ధర్(aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ సినిమా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్(ajit Doval) జీవితంలోని కొన్ని యదార్థ సంఘటనల నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించగా ఇప్పుడా సినిమా ప్రభాస్ మూవీకి పోటీగా రిలీజ్ కాబోతుంది. దీంతో అప్పటివరకు రాజా సాబ్ కు సోలో రిలీజ్ దక్కిందని సంతోషించిన డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ప్రభాస్, రణ్‌వీర్ సింగ్ ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కెట్, క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఒకే రోజున వీరిద్దరి సినిమాలు రిలీజవడం ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ పండితులంటున్నారు.