ఆ రెండూ ఒకేసారి చేయనున్న ప్రభాస్
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అసలెలాంటి టెన్షన్ లేకుండా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి2 కూడా చేయాల్సి ఉంది. రీసెంట్ గా హను రాఘవపూడితో సినిమాను మొదలుపెట్టాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. స్పిరిట్ పై మాస్ ఆడియన్స్ లో గట్టి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇక హను రాఘవపూడి సినిమాలో బ్రిటీష్ ఇండియా కాలంలో సైనికుడిగా కనిపించనున్నాడట ప్రభాస్. ఈ రెండు పాత్రలూ పవర్ఫుల్ క్యారెక్టర్లు కావడంతో ప్రభాస్ కచ్ఛితంగా దాని కోసం ఫిజికల్ ఫిట్ నెస్ మెయిన్టెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమాను నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చేసి 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు సమాంతరంగా హను రాఘవపూడి సినిమాను కూడా చేయాలని ప్రభాస్ డిసైడయ్యాడట. దానికి కారణం ఈ రెండు సినిమాలకు ఆయన లుక్ ఒకేవిధంగా ఉండే ఛాన్స్ ఉండటమే. అంతేకాదు కల్కి2 కూడా వచ్చే ఏడాదిలోనే మొదలుకానున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రభాస్ చేతిలో ఎక్కువ సినిమాలున్నప్పటికీ సరైన ప్లానింగ్ వల్ల ఏ టెన్షన్ లేకుండా వాటిని పూర్తి చేయగలుగుతున్నాడు.













