కంగువ ఈవెంట్ కు ప్రభాస్?
నవంబర్ 15న రిలీజ్ కానున్న కంగువ(Kanguva) సినిమా కోసం గ్రౌండ్ సిద్ధమవుతుంది. ఈ ఇయర్ లో రానున్న అతి పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాపై చాలానే అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు త్రీడీ వెర్షన్ తాలూకు వర్క్స్ ఆఖరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కు ఇన్విటేషన్ కూడా వెళ్లిందని టాక్. కంగువ నిర్మాతల్లో ఒకరైన యువి క్రియేషన్స్(UV Creations) అధినేతలు వంశీ, ప్రమోద్ ప్రభాస్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లు అడిగితే ప్రభాస్ నో చెప్పే ఛాన్స్ ఉండదు.
కాకపోతే హను రాఘవపూడి(Hanu Raghavapudi) తో చేస్తున్న ఫౌజి(Fouji) షూటింగ్ లో బిజీగా ఉన్న టైమ్ లో ప్రభాస్ ఈ ఈవెంట్ కు వస్తాడా అనేది ఒక డౌట్. కానీ ప్రభాస్ వీలును బట్టే ఈవెంట్ ను ప్లాన్ చేసి పిలుస్తారు కాబట్టి అనుమాన పడక్కర్లేదనేది మరొక వెర్షన్. ఇదే నిజమైతే ప్రభాస్, సూర్యను ఒకే స్టేజ్ మీద చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పే మాటలు ఎలా ఉంటాయోనని అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది.













