Prabhas: కన్నప్పకు ప్రభాస్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడంటే..
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప(Kannappa) సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తుండగా మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్(Prabhas) ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రాగానే కన్నప్పపై ఒక్కసారిగా బజ్ భారీగా పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే కన్నప్ప కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత ఛార్జ్ చేశాడనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.
మామూలుగా ప్రభాస్ ఒక్కో మూవీకి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు బడ్జెట్ ను బట్టి తీసుకుంటూ ఉంటాడు. కానీ కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాను చేశాడట. తమ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ తోనే ప్రభాస్ ఈ సినిమాను చేశాడనే విషయాన్ని స్వయంగా మంచు విష్ణు వెల్లడించాడు. ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రభాస్ క్రేజ్ బాగా కలిసొచ్చే ఛాన్సుంది.













