Spirit: ఆ హీరోయిన్ ను రికమెండ్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) స్పిరిట్(Spirit) అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్(Raja Saab), ఫౌజీ(Fauji) సినిమాలు పూర్తైన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అయితే మొదట్లో ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika Padukone)ను హీరోయిన్ గా ఫిక్స్ చేసిన సందీప్, ఇప్పుడు ఆ స్థానంలోకి వేరే వాళ్లను తీసుకోవాలని చూస్తున్నాడు.
ప్రభాస్ పక్కన అందంగా, పొడుగ్గా ఉంటే హీరోయిన్ అయితే బావుంటుందని భావిస్తున్న మేకర్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ ఓ హీరోయిన్ పేరుని సిఫారసు చేస్తున్నారు. తనెవరో కాదు సీతారామం(Sitaramam) హీరోయిన్ మృణాల్(Mrunal Thakur). ప్రభాస్ హైట్ కు మృణాల్ అయితే అతని పక్కన అన్ని విధాలా బావుంటుందని, వారిద్దరి జంట కూడా బావుంటుందని సందీప్ రెడ్డి వంగాకు సూచిస్తున్నారు.
ఫ్యాన్స్ చెప్పినట్టు స్పిరిట్ సినిమాకు మృణాల్ ను తీసుకుంటే మంచి ఎంపికే అవుతుంది. మృణాల్ కు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో తనైతే బావుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. పైగా మృణాల్ కు తెలుగుతో పాటూ బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీటన్నింటి కంటే ముఖ్యమైంది మృణాల్ మంచి పెర్ఫార్మర్ కూడా. ఒకవేళ అవసరమైతే మృణాల్ తో తెలుగు డబ్బింగ్ చెప్పించొచ్చు. మరి స్పిరిట్ కోసం సందీప్ ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) పేరు కూడా వినిపిస్తోంది. కానీ రుక్మిణి, ఎన్టీఆర్‌నీల్(NTRNeel) సినిమాకు కమిట్‌మెంట్ ఇవ్వడంతో ప్రభాస్ మూవీలో ఆఫర్ వచ్చినా చేస్తుందో లేదో తెలియదు. ఏదేమైనా స్పిరిట్ లో దీపిక తప్పుకున్న తర్వాత ఎవరు నటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.