ఫ్యాన్స్ కు ప్రభాస్ హామీ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో కృతి సనన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో అదిరిపోయేలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను స్టేజ్ మీద చూసిన ఫ్యాన్స్ ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చాలా సేపే మాట్లాడతారనుకున్నారంతా. కానీ డార్లింగ్ మాత్రం ఎప్పటిలాగే స్వీట్ అండ్ షార్ట్ గా తన స్పీచ్ ను ముగించాడు. కాకపోతే ఈసారి డార్లింగ్ నుంచి ఫ్యాన్స్ ఆశించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పే తన ప్రసంగాన్ని ముగించాడు. తన పెళ్లి ప్రస్తావన తనే తీసుకొచ్చి మరీ సమాధానమిచ్చాడు.
అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని, అది కూడా తిరుపతిలోనే చేసుకుంటానని ప్రభాస్ ఈ సందర్భంగా వెల్లడించాడు కానీ ఎవరిని చేసుకుంటాడనేది మాత్రం చెప్పలేదు. దీంతో పాటూ ఇకముందు సంవత్సరానికి కనీసం రెండు సినిమాలైనా చేస్తానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కుదిరితే మూడు సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమని ఈ సందర్భంగా ప్రభాస్ పేర్కొన్నాడు.
ప్రభాస్ చెప్పినట్లే ఈ జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది. సలార్ సెప్టెంబర్ 28కు ఆల్రెడీ షెడ్యూల్ అయింది. ఇక ప్రాజెక్ట్ జనవరిలో రానున్న విషయం తెలిసిందే. అంటే 8 నెలల్ గ్యాప్ లో ప్రభాస్ మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడంటే డార్లింగ్ సినిమాలపై ఏ రేంజ్ ఫోకస్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.













