ఆ సమస్య ప్రభాస్ ను కూడా వదల్లేదుగా!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు లీకుల సమస్య ఎక్కువ అయిపోయింది. సాధారణంగా ఈ సమస్య రిలీజ్ తర్వాత ఉండాలి కానీ ఎప్పుడైతే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కు ముందే ఆన్లైన్ లోకి వచ్చేసిందో అప్పుడే ఈ పైరసీ మాఫియా ఊపందుకుంది. రిలీజ్ కు ముందే ఒరిజినల్ ప్రింట్ ఆన్లైన్ లోకి రావడంతో చెప్పిన డేట్ కంటే ముందే సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ లీక్ ప్రభావం ఆ సినిమాకు మాత్రం ప్లస్ అయిందనే చెప్పాలి. కానీ ఈ పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీకి ఏటా కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్‌లు జరుగుతున్న సందర్భంలోనే ఫోటోలు బయటకురావడం, అవి నెట్టింట వైరల్ అవడం ఇప్పుడు జరుగుతున్నాయి. ఫోటోలొస్తే పెద్దగా డ్యామేజ్ ఉండదు కానీ కొన్ని కీ సీన్స్‌కు సంబంధించిన సీన్స్ కూడా లీకవుతుండటంతో దర్శకనిర్మాతలకు ఇదో పెద్ద సమస్యగా మారింది.
ప్రధానంగా ఎడిటింగ్ రూమ్ నుంచి, వీఎఫెక్స్ స్టూడియోల నుంచి ఈ లీకులు ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి సినిమాకు సంబంధించిన కొన్ని కీ సీన్స్ వీఎఫెక్స్ కంపెనీ నుంచి బయటికొచ్చినట్లు మేకర్స్ గుర్తించారు. దీంతో ఆ కంపెనీపై కేసు పెట్టి, భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
రీసెంట్గా రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఓ డ్యూయెట్ ఆడియో రూపంలో బయటకొచ్చింది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దీనిపై నిర్మాత దిల్ రాజు వెంటనే అప్రమత్తమై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక ఎంత జాగ్రత్త తీసుకుని మాత్రం ఏం లాభం? ఏదేమైనా మొత్తానికి పాన్ ఇండియా మూవీలకు లీకుల బెడద ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.













