పూరీ కోసం డార్లింగ్ వస్తాడా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో ఛార్మీ, పూరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మొత్తం మీద రూ.100 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.
దీంతో రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా డబుల్ ఇస్మార్ట్ నిలిచింది. పూరీ-రామ్ కాంబోలో వచ్చి మంచి హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట.
ఈ ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా ప్యాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ను తీసుకురావాలని చూస్తున్నాడట పూరీ. ప్రభాస్-పూరీ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరి కాంబోలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలొచ్చాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీకి ప్రభాస్ కి కూడా మంచి అనుబంధమే ఉంది. వీరిద్దరూ కలిసి చక్రం, పౌర్ణమి సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలవాలనుకుంటున్నారట. పూరీతో ఉన్న బాండింగ్ వల్ల ఈ సినిమాను ఎంకరేజ్ చేయడానికి పూరీ కూడా ముందుకొచ్చే ఛాన్సుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ నిజంగా డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కు గెస్టుగా వస్తే సినిమాపై హైప్ తారాస్థాయికి వెళ్లడం ఖాయం.













