Prabhas: తన హీరోయిన్‌కు ఇంటి భోజనం పంపిన ప్రభాస్
ప్రభాస్(Prabhas) సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందంటే ఆయన ఇంటి నుంచి కచ్ఛితంగా భోజనం రావాల్సిందే. ఆయనతో పాటూ ఓ 15 మందికి ప్రభాస్ ఇంటి నుంచి 10-15 రకాల వెరైటీలతో విందు భోజనం వస్తుంది. ప్రభాస్ ఇంటి భోజనానికి చాలా క్రేజ్ ఉంది. ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi esmail) కూడా చేరింది.
హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఇమాన్వీ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా ఫౌజీ(Fouji). ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సందర్భంగా తన హీరోయిన్ ఇమాన్వీకి ప్రభాస్ తన ఇంటి భోజనం రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇమాన్వీనే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఇంతటి రుచికరమైన మంచితనానికి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ ను ట్యాగ్ చేస్తూ భోజనం ఫోటోతో పాటూ నోట్లో నీళ్లూరే ఎమోజీని షేర్ చేసింది. ఇక ఫౌజీ సినిమా గురించి చెప్పాలంటే 1970 కాలం నాటి పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడని సమాచారం. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.













