ప్రభాస్-హను.. చాలా పెద్ద సెటప్పే ఉందిగా
టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఎంతో క్రేజ్ ఉన్న ప్రభాస్ తన సినిమాల వేగాన్ని పెంచేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదికి రెండు సినిమాలు ఆడియన్స్ కు చూపించాలని ప్రభాస్ పడుతున్న తపన స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాతో ఇమాన్వి అనే కొత్త టాలెంట్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సీతారమంతో మృణాల్ ని పరిచయం చేసిన హను, ఇప్పుడు మరో టాలెంటెడ్ బ్యూటీని తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా వెనుక చాలా పెద్ద సెటప్ ఉన్నట్లు అనిపిస్తోంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు.
ఇందులో ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, అణిచివేయబడిన వర్గాలకు ప్రతినిధిగా, చీకట్లో మగ్గుతున్న ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చే యోధుడిగా కనిపించనున్నాడట ప్రభాస్. ఎక్కువ డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు కెరీర్లోనే అత్యంత ప్రభావవంతమైన క్యారెక్టర్ గా చెప్తున్నారు. మారుతితో చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా పనులు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది.













