మాట నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడాదికి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను మరింత పెంచుకుంటూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దీని కోసం ప్రభాస్ కనీస రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాడు. ఓ వైపు కాలి గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సెట్స్ పైనున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు ప్రభాస్.
ఈ ఏడాది కల్కి, ది రాజా సాబ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్, వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. సలార్-2 షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలు కానుందట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ కానున్నట్లు కన్ఫర్మ్ అయింది.
దీంతో పాటూ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాను కూడా ఈ ఏడాదే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా ఒకే సంవత్సరంలో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. దాని కోసం సదరు నటుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రభాస్ ఎంత కష్టపడుతున్నాడో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.













