ప్రభాస్ భారీ విరాళం…
అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న ఆయన ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.2 కోట్లు అందించారు. ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ ఫార్క్‌కు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌లతో పాటు ప్రభాష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంపీ సంతోష్‌కుమార్ చొరవతో ప్రభాస్ ఈ అ•వీ భూమిని దత్తత తీసుకున్నారు. తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరు మీద ఈ అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు పార్కు శంఖుస్థాపన సందర్భంగా ప్రభాస్ అన్నారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ త్వరలోనే మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.













