Fouji: ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్
ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab) చేస్తున్న ప్రభాస్(Prabhas) మొదటిసారి తన కెరీర్లో హార్రర్ కామెడీ జానర్ ను ట్రై చేస్తున్నాడు. రాజా సాబ్ పూర్తి చేయకుండానే ప్రభాస్ సీతారామం(Sitaramam) డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) ను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లాడు. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఫౌజీకు సంబంధించిన 30 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్టు సమాచారం. ఈ సినిమా కీలక భాగం షూటింగ్ కారైకుడి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగనుంది. నెక్ట్స్ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారంటున్నారు. ఎలాంటి బ్రేకుల్లేకుండా డైరెక్టర్ హను ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో మొదలుపెట్టి మార్చి ఎండింగ్ వరకు ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతుందని యూనిట్ సభ్యులంటున్నారు. వీలైనంత త్వరగా ఫౌజీ షూటింగ్ ను పూర్తి చేసి, నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలను పూర్తి చేశాక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో స్పిరిట్(Spirit) సినిమాను చేయనున్నాడు.













