అసెంబ్లీకి వచ్చిన పోసాని
శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అను నేను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసి అసెంబ్లీ సెట్లో మూవీ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుండగా, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రీసెంట్గా పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవాలపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించారు. ఆ సీన్‌కి సంబంధించిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం డివివి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై నిర్మితమవుతుండగా, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. కైరా ఆద్వానీ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.













