పూజాకు మరో బంపర్ ఆఫర్
తెలుగులో ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా పూజా హెగ్డే బిజీగా ఉంది. గతంలో హృతిక్ రోషన్ నటించిన మొహెంజోదారో సినిమాతో పూజా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హౌస్‌పుల్ 4లోనూ నటిస్తోంది. తాజాగా పూజా మరో బంపర్ ఆఫర్‌ని అందుకున్నట్టు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఇది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో అక్షయ్ సరసన కథానాయిక పాత్ర కోసం పూజాని సంప్రదించారట. స్క్రిప్ట్ విన్న ఆమె సినిమా చేసేందుకు తన ఆసక్తి కనబర్చాటర. ప్రస్తుతం పూజా నటిస్తున్న హౌస్‌పుల్ 4లో అక్షయ్ కుమార్ ఓ హీరోగా నటిస్తున్న విషయం విదితమే. బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరూ మరోమారు మైస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో మహేష్‌బాబు మహర్షి చిత్రం, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమాలోనూ పూజానే కథానాయికగా నటిస్తున్నారు.













