త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న పూజా?
ఏ టైమ్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఆ సినిమాకు ఏదీ కలిసి రావట్లేదు. మొదట్లో స్క్రిప్ట్ విషయంలో లేట్ అయిన సినిమా, ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లి ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక ఆ సీన్స్ తో శాటిస్పై కాక, షూటింగ్ ఆపేసి మళ్లీ వేరే కథ రెడీ చేసి సెట్స్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా షూటింగ్ కు ఏదో అడ్డు రావడం జరుగుతూనే ఉంది.
రీసెంట్ గా టైటిల్, టీజర్ రిలీజ్ కావడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారంతా. ఇక ఏ గోల లేకుండా సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు కానీ మళ్లీ ఈ సినిమా గురించి నెగిటివ్ న్యూస్ లు ఫిల్మ్ నగర్ లో మొదలయ్యాయి. మొదట ఈ సినిమా నుంచి థమన్ ను తప్పించారని వార్తలొచ్చాయి కానీ అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోనుందని వార్తలొచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, పూజా ఈ సినిమా నుంచి తప్పుకోవడం నిజమే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమా నుంచి పూజా తప్పుకోవడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ కు గత కొన్ని సినిమాల నుంచి పూజానే ఫేవరెట్. ఆయనకు ఏ హీరోయిన్ నచ్చినా సరే వారితో వరుసగా మూడు సినిమాలు తీస్తాడని టాక్. గతంలో సమంతతో అలానే చేశాడు.
ఇప్పుడు పూజాతో కూడా అదే రిపీట్ చేస్తున్నాడనుకుంటున్న తరుణంలో ఈ సినిమా నుంచి పూజా అవుట్ అని వార్తలొచ్చాయి. దీంతో ఇప్పుడు ఆ సినిమాలో పూజా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా హీరోయిన్ విషయంలో త్వరగా ప్రొడక్షన్ హౌస్ ఏదొక క్లారిటీ ఇస్తే ఈ వార్తలకు చెక్ పెట్టొచ్చు.













