ఆచార్యలో పూజా క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఉండనుందా..!
ఆచార్య లో సినిమాలో నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఉందా..? ఆ పాత్రలో రమ్యక్రిష్ణ నటిస్తుందా? అంటే దానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెప్తున్నారు. అందులో చాలా మంది చెప్తున్న సమాధానం మాత్రం ఇదే. నీలాంబరి టైప్ క్యారెక్టర్ ఆచార్యలో ఉంది కానీ అందులో కనిపిస్తుంది మాత్రం రమ్యక్రిష్ణ కాదు, పూజా హెగ్డే ఆచార్యలో నీలాంబరిగా కనిపించనుంది. అది కూడా రామ్ చరణ్ సరసన గెస్ట్ గా కనిపించనుందంతే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మెరుపులా కొన్ని కొన్ని సీన్సలో కనిపించి కనుమరుగవుతుందంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే, అసలు నీలాంబరి ఎవరు? ఆచార్యలో తనేం చేస్తుందంటే.. గిరిజన మహిళ అయిన నీలాంబరి ఉద్యమస్పూర్తి, పోరాటాలతో ఉండే రామ్ చరణ్ ను అనుసరించే ఒక గిరిజన యువతిగా తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ పేరు నీలాంబరి అని తెలుస్తుంది. నీలాంబరి అనగానే నరసింహా సినిమాలో రజినీకాంత్ తో పోటీపడి నటించిన రమ్యక్రిష్ణ నే ప్రేక్షకులకు గుర్తొస్తుంది. మరి ఆ పేరు పూజా కు పెట్టిన కొరటాల, పూజా క్యారెక్టర్ ను తక్కువ చేసే చూపిస్తే అందరి మనసులు గాయపడతాయేమో? ఏదేమైనా మే 13న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.













