పూజాకు బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్స్!
ఇటు తెలుగులోను, అటు బాలీవుడ్‌లోను క్రేజీ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకి అవకాశాల మీద అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం పలు తెలుగు, హిందీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో బిజీగా ఉంటున్న పూజా తాజాగా ఓ భారీ క్రేజీ ఆఫర్‌ని దక్కించుకుంది. బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాత సాజిద్ నడియడ్వాలా నిర్మించబోయే మూడు వరుస చిత్రాల్లో నటించేందుకు పూజాని ఎంపిక చేశారట. అంతేకాదు ఈ మూడు చిత్రాలు వేటికవే డిఫరెంట్ కథలతో ఉంటాయట. అలాగే ఇందులో పూజా పోషించే పాత్రలు సైతం చాలా ఫ్రెష్‌గా ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఏదిఏమైనా గోల్డ్న్లెగ్గా తెలుగనాట మంచి గుర్తింపు పొందిన పూజా బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్స్ అందుకోవడం విశేషమనే చెప్పాలి.













