సిద్దుకి జోడీగా పూజా?
ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన తెలుగు సినిమాల్లో టిల్లు స్వ్కేర్ కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్వ్కేర్ తర్వాత ఓ వైపు జాక్, తెలుసు కదా సినిమాలు చేస్తూనే మరోవైపు టిల్లు క్యూబ్ సినిమా పనులను కూడా చూసుకుంటున్నాడట. డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఆ బాధ్యతల్ని మ్యాడ్ డైరక్టర్ కళ్యాణ్ శంకర్ కు అప్పగించనున్నారని ఇప్పటికే లీకులొచ్చాయి.
ఇదిలా ఉంటే టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డేని తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ ఫిక్స్ కాలేదు కానీ పూజా అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారట. పూజా ప్రస్తుతం ఫామ్ లో లేదు. రీసెంట్ గా హిందీలో ఆమె చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ గా మిగిలింది. గుంటూరు కారం సినిమా నుంచి సగం షూటింగ్ అయ్యాక తప్పుకుంది.
పూజా సిట్యుయేషన్ తెలిసి కూడా సిద్దూ ఆమె వైపే మొగ్గు చూపడం వెనుక ఓ స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. టిల్లు స్వ్కేర్ లో అనుపమను ఫైనల్ చేస్తున్న టైమ్ లో కూడా ఇంతే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫామ్ లో లేని అనుపమతో తీసుకొచ్చి ఈ సూపర్ హిట్ సీక్వెల్ ను ఎలా వర్కవుట్ చేస్తారనుకున్నారంతా. కానీ సినిమా రిలీజయ్యాక చూస్తే అనుపమ తన పాత్రలో ఒదిగిపోయిన తీరుతో పాటూ గ్లామర్ డోస్ కూడా పెంచి బాగానే వర్కవుట్ చేసింది. కాబట్టి ఇప్పుడు టిల్లు క్యూబ్ కు అనుపమ రాంగ్ ఛాయిస్ అయ్యే అవకాశమైతే ఉండకపోవచ్చు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే పూజా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సుంది.













