బుట్టబొమ్మ మళ్లీ బిజీ అవుతుందే!
గతేడాది వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్లతో పూజాకు ఛాన్సులు బాగా తగ్గాయి. తర్వాత గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడంతో పూజా చేతిలో ఆఫర్లు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ పూజాకు వరుస ఛాన్సులు వస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప2 తర్వాత బన్నీతో అట్లీ సినిమా చేయబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ను పూజా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన డీజే, అల వైకుంఠపురములో మంచి హిట్లన్న విషయం తెలిసిందే. దీంతో పాటూ నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా పూజా అవకాశాన్ని అందుకుందని సమాచారం.
ఇప్పటివరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన వార్తలు రావడమే కానీ అఫీషియల్ గా మాత్రం మేకర్స్ పూజాను కన్ఫర్మ్ చేసింది లేదు. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడ వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ఇటీవల బాలీవుడ్ మూవీ దేవా సెట్స్ లో అడుగుపెట్టిన పూజా ఇప్పటివరకు కనిపించని రోల్ లో సందడి చేయనుందట. మరోవైపు కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న కొత్త సినిమాలో కూడా పూజా ఛాన్స్ కొట్టేసింది. వీటితో పాటూ అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీ సినిమాలో కూడా పూజానే హీరోయిన్. మొత్తానికి పూజా బ్యాడ్ ఫేస్ లో కూడా వరుస సినిమాలతో బిజీగానే ఉంది.













