బాలయ్య110 కు రంగం సిద్ధం!
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా ఎవరితో చేయనున్నాడనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బోయపాటి తో సినిమా అనుకున్న మాట నిజమే. దానికి తోడు ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండనుందన్న విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే బాలయ్య నెక్ట్స్ సినిమా బోయపాటితోనేనా కాదా అన్నదే ఇంకా తెలీలేదు.
ఇదిలా ఉంటే వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలున్నారని తెలుస్తోంది. కానీ బాలయ్య ఏపీ ఎలక్షన్స్ హడావిడిలో ఉండటం వల్ల తన డేట్స్ ఖాళీగా లేవు. అయితే నిర్మాతలు మాత్రం రెగ్యులర్ షూటింగ్ లేటయినా ఫర్వాలేదు కానీ ముందైతే పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెడదామని చెప్పారట.
దీంతో బాలయ్య ఈ సినిమా కోసం మంచి ముహుర్తం పెట్టించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఏప్రిల్ 9న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యే అవకాశాలున్నాయి. బోయపాటి నుంచి వచ్చిన ఆఖరి సినిమా స్కంద డిజాస్టర్ అవడంతో బోయపాటి శ్రీను కు ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. దానికి తోడు బాలయ్యతో బోయపాటి చేస్తున్న నాలుగో సినిమా. కాబట్టి ఈ సినిమాతో బోయపాటి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరి దశలో ఉన్న స్క్రిప్ట్ పనులను అల్లు అరవింద్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడని సమాచారం. ఏదేమైనా బాలయ్య110 కు రంగం సిద్దమైందన్నమాట.













