పీపుల్ మీడియా రూటే సపరేట్
టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పీపుల్ మీడియా సంస్థ మంచి గుర్తింపు అందుకుంటోంది. ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తన స్పెషల్ టేస్ట్ తో అన్ని రకాల జానర్ల సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారు.
ఈ బ్యానర్ నుంచి వచ్చే నెల 15న మిస్టర్ బచ్చన్ సినిమా రానుంది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇది కాకుండా రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాజా సాబ్ రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యానర్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రానున్నాయి. తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్ తో G2 లాంటి సినిమాలను తెరకెక్కిస్తోంది. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. మొత్తానికి పీపుల్ మీడియా సంస్థ సినీ రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళ్తుంది.













