‘సర్కారు వారి పాట’ నుంచి పెన్సీ సాంగ్ ప్రోమో సితార ఘట్టమనేని స్పెషల్ అట్రాక్షన్
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారువారిపాట’. ఈ సినిమా నుంచి ఎవ్రీ పెన్నీ సాంగ్ ప్రోమోను శనివారం విడుదల చేశారు. పూర్తి పాటను ఆదివారం రిలీజ్ చేస్తారు. ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సితార ఘట్టమనేని యాక్ట్ చేయటం కొస మెరుపు. ‘సర్కారువారిపాట’. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఇంతకీ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు మేకర్స్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో తెలుసా! ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ కుమార్తె సితార నటించింది. అందులో కొన్ని స్టెప్స్‌ను ప్రోమోలో విడుదల చేశారు. ఇక ‘సర్కారువారిపాట’ సినిమా విషయానికి వస్తే సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మే 12న సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రోమో, కళావతి సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. వాటికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆదివారం సినిమా నుంచి ఎవ్రీ పెన్నీ సాంగ్ రానుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
https://twitter.com/













