Peddhi: ఎమ్మిగనూరులో పెద్ది రచ్చ
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) తో చేసిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవడంతో చరణ్ ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ ప్రస్తుతం చేస్తున్న సినిమా పైనే పెట్టుకున్నారు. ప్రస్తుతం చరణ్ ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddhi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ అనేలా బుచ్చిబాబు ఈ పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది సినిమాను రూపొందిస్తున్నాడట. ఐపీఎల్ ముందు పెద్ది నుంచి ఫస్ట్ షాట్ రూపంలో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆ గ్లింప్స్ లోని ఆఖర షాట్ ఐపీఎల్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా మంచి రీచ్ ను తెచ్చుకుంది.
ఇప్పుడు తాజాగా ఈ గ్లింప్స్ ఏరువాక పౌర్ణమి ఉత్సవాల్లో వైరల్ అయింది. ఎమ్మిగనూర్ సమీపంలోని గుడికల్ గ్రామంలోని యువత ఈ ఏరువాక పౌర్ణమి పండుగను పెద్ది మోడ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. యూత్ నుంచి చిన్న పిల్లల వరకు ఒకే రకం కాస్ట్యూమ్స్, పెద్ది బ్యాట్లు పట్టుకుని గ్లింప్స్ లో చరణ్ చేసన షాట్ ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు.
https://www.instagram.com/reel/DK04z65R8II/?utm_source=ig_web_copy_link






