Peddhi: పెద్ది నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే
రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పెద్ది(Peddhi). ఈ సినిమా ఎప్పుడో మొదలవాల్సింది కానీ గేమ్ ఛేంజర్(Game Changer) లేటవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఈ మూవీపై పడింది. ఉప్పెన(Uppena) సినిమా తర్వాత ఎంతో టైమ్ తీసుకుని మరీ పెద్ది సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు బుచ్చిబాబు. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అందరికీ చాలానే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొన్నామధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పెద్ది గ్లింప్స్ కేవలం మెగా ఫ్యాన్స్‌నే కాకుండా యాంటీ ఫ్యాన్స్ ను కూడా మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
పెద్ది సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మే 16 నుంచి కర్ణాటకలో జరుగుతుందని తెలుస్తోంది. పది రోజుల పాటూ జరిగే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటూ హీరోయిన్ జాన్వీ కపూర్, మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్టు సమాచారం. పెద్ది మూవీని వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas), మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






