పవన్ సినిమాలో ‘స్పై’ హీరోయిన్
యంగ్ డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నాడని ఇప్పటికే తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్, నిర్మాత దానయ్య కూడా సుజీత్‌ని బాగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
దీంతో తనకు ఇచ్చిన ఫ్రీడమ్‌ను సుజిత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ క్యాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీని ఒక పవర్ ఫుల్ రోల్ కోసం తీసుకున్న సుజీత్, ఈ సినిమాలో అమితాబ్‌తో కూడా ఒక స్పెషల్ రోల్ చేయించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఓజీ సినిమా హీరోయిన్ విషయంలో సుజిత్ ఎవరూ ఊహించిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్గా స్పై సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఐశ్వర్య మీనన్ ను పవన్ కు జోడీగా తీసుకునే ఛాన్సుందని తెలుస్తోంది. ఎప్పుడో లవ్ స్టోరీ సినిమాలో కనిపించిన ఐశ్వర్య మళ్లీ ఇన్నాళ్లకు స్పై సినిమాలో కనిపించింది. అలాంటి ఐశ్వర్యకు సుజిత్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ వార్తలు నిజమై ఐశ్వర్యకు ఈ ఛాన్స్ దక్కితే మాత్రం ఓజీ తర్వాత అమ్మడుకు వరుస ఛాన్స్ లు రావడం పక్కా. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.













