ఏకే రీమేక్ లో హైలైట్స్ అవే..
అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమే అందిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా దగ్గుబాటి హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్లే ఇందులో నిజాయితీ గల పోలీసాఫీసర్ గా పవన్, అతన్ని ఢీకొట్టే క్యారెక్టర్ లో రానా కనిపించనున్నారు. అయితే తెలుగు వెర్షన్ లో పవన్ ని దృష్టిలో పెట్టుకున్న స్టోరీలో ఛేంజెస్ చేశారని, రానా క్యారెక్టర్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి కానీ మలయాళంలో సినిమాలానే ఇక్కడ పవన్, రానా రోల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని తెలుస్తుంది. ఒకరికొకరు ధీటుగా నిలబడే ఈ క్యారెక్టర్ కు తగ్గట్లే త్రివిక్రమ్ తనదైన శైలిలో సన్నివేశాలు రాసున్నారట. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ పోటాపోటీగా ఉంటాయని, త్రివిక్రమ్ వాటిని చాలా లోతుగా ఆలోచింపచేసేలా నిలవనున్నాయని చెప్తున్నారు. పవన్, రానాల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయట.













