ఓజీ డే1 టార్గెట్ ఫిక్స్..
ఏపీ ఎలక్షన్స్ కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ తిరిగి షూటింగుల్లో జాయిన్ కాబోతున్నాడని తెలుస్తోంది. జూన్ చివరి నుంచి లేదా జులై నుంచి పవన్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడంటున్నారు. పవన్ కమిటైన సినిమాల్లో ముందుంది అంటే హరిహర వీరమల్లు. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి డైరెక్టర్ మారినట్లు తెలిపారు.
పవన్ ఓకే అంటే వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత పవన్ చేస్తున్న సినిమాల్లో అన్నింటికంటే క్రేజ్ ఎక్కువగా ఉంది ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. పవన్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. కచ్ఛితంగా ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుందని ఎంతో ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎటు చూసినా పవన్ క్రేజ్ కనిపిస్తుండటంతో ఆ ఎఫెక్ట్ ఓజీపై ఉంటుంది. అందుకే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ సునామీ సృష్టించబోతున్నాయంటున్నారు. ఓజీ తప్పకుండా మొదటి రోజే రూ.100 కోట్లు సాధిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.













