భీమ్లా నాయక్ పోరాటాలు…
టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో స్క్రీన్ ప్లే సంభాషణల సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్ ఈ చిత్రం పేరును అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. తర్వాత చిత్రం పేరును, వీడియోను అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు హరిష్ శంకర్. పనవ్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలతో పాటు నిత్య మీనన్, మురళీశర్మ, రఘుబాబు, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు, పోరాట దృశ్యాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాము. 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తాము అని తెలిపారు.













