పఠాన్ మేకర్స్ కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..
పఠాన్ సినిమాలోని `బేషరాం` సాంగ్ లో దీపికా పదుకొనే ధరించిన బికినీ దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఒక్క బికినీ తో దీపిక అల్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు సినీ వర్గాల చర్చలు, పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్దం, మరోవైపు అమితాబచ్చన్, ప్రకాష్ రాజ్ లాంటి సినీ పెద్దలు దీపికకి మద్దతివ్వడం, షారక్ ఖాన్ దిష్టబోమ్మలు దగ్ధం అవ్వడం..అబ్బో ఒక్కటేంటి ఈ అమ్మడి బికినీ చుట్టూ చాలా విషయాలే జరిగాయి.
దీపిక స్కిన్ షోపై సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోలింగ్ జరిగింది.పెళ్లైన హీరోయిన్ అలాంటి సన్నివేశాల్లో నటించాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. వ్యక్తిగతంగానూ దీపికా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇన్ని జరుగుతున్నా `పఠాన్` అండ్ టీం మాత్రం ఎక్కడా కంప్రమైయిజ్ అవ్వట్లేదు. ఏ బేదిరింపును పట్టించుకోలేదు. ఏ పార్టీ వ్యాఖ్యల్ని లెక్క చేయలేదు. షారుక్ ఖాన్ కూడా లేటు వయసులో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు.
ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పఠాన్ టీం కి, షారుక్..దీపిక లకు సెన్సార్ రూపంలో గట్టి షాక్ ఇచ్చింది. ఎక్కడ నుంచి నరుక్కుంటూ వస్తే తెగుతుందో? అక్కడి నుంచే వేటు వేయడం మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్ నేరుగా రంగుంలోకి దిగింది. దీపిక బికినీ సహా పాటలో ఆమె అందాల ఆరబోతపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ నిర్మాతని కోరింది.
రిలీజ్ అవ్వడానికి ముందే ఇలాంటి వివాదాలు మంచిది కాదని, కచ్చితంగా సెన్సార్ నిబంధలను పాటించి తీరాలని ఆదేశాలిచ్చింది. దీంతో బేషరాం పాటలో మార్పులు తధ్యమని తెలుస్తోంది. బికినీ రంగు సహా..దీపిక స్కిన్ షోని బ్లర్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సెన్సార్ అభ్యంతరం మేరకు ఆ పాటలో మార్పులు చేస్తారా? లేక పూర్తిగా పాటనే తొలగిస్తారా? అన్నది చూడాలి. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుందన్న విషయం తెలిసిందే.













