మళ్లీ కోర్టులోకి పరిణీతి చోప్రా
ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. మళ్లీ బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెడుతున్నా అంటోంది పరిణీతి చోప్రా. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో పరిణీతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే కొద్దిరోజుల క్రితం చిత్రీకరణలో పరిణీతికి గాయమైంది. మెడ నొప్పితో బాధపడుతున్న ఆమెను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీంతో చిత్రీకరణ ఆగింది. పదిరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ పరిణీతి రంగంలోకి దిగుతోంది. ఈ సందర్భంగా తన క్షేమ సమాచారాన్ని వెల్లడిస్లూ నేను వందశాతం ఆరోగ్యంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవడానికి కారణమైన వైద్య బృందానికి, నాకు అండగా నిలిచిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ షెడ్యూల్లో తెరకెక్కించే కీలక సన్నివేశాల కోసం నేను సుమారు 8 గంటలు బ్యాడ్మింటన్ ఆడాల్సి ఉంది. అయితే దాన్ని నేను విజయవంతంగా పూర్తి చేయగలనన్న విశ్వాసంతో ఉన్నారు. పూర్తి ఫిట్నెస్తో తిరిగొచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపింది పరిణీతి.













