పండుగాడి ఫొటో స్టూడియో ఆడియో విడుదల
అలీ 52 సినిమాల హీరో మాత్రమే కాదు. తన మనుషుల కోసం నిలబడే నిజమైన హీరో అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. హైదరాబాద్‌లో జరిగిన పండుగాడి ఫొటో స్టూడియో పాటల విడుదల వేడుకకి ఆయన హాజరయ్యారు. అలీ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దిలీప్ రాజా దర్శకుడు. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాత. ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ట్రైలర్‌ని విడుదల చేశారు. బోయపాటి శ్రీనుతో పాటు కలిసి పూరి జగన్నాథ్ పాటల సీడీల్ని ఆవిష్కరించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పకుండా వచ్చి నన్ను కలిసే ఒకే వ్యక్తి అలీ. పండుగాడి.. ట్రైలర్ బాగుంది,. సినిమా విజయవంతం అవుతుందని ఆకాక్షించారు. అలీ మాట్లాడుతూ కథ, పాటలు నచ్చి ఈ సినిమా చేశా. అనుకొన్న బడ్జెట్లోనే పూర్తయింది అన్నారు. ఈ కార్యక్రమలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, అల్లరి నరేష్, వి.కె.నరేష్, బాబూ మోహన్, శ్రీకాంత్, ఛార్మి, యాజమాన్య, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు.













