హమ్మయ్యా పవన్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్ఫర్మ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతీ ఒక్క హీరో ఈ మధ్య పాన్ ఇండియన్ రేంజ్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏదో మాట వరసకి కాదు. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి సినిమా ప్రమోషన్ల వరకు ప్రతీ దాంట్లో పాన్ ఇండియన్ ఫిల్మ్ అని ఆడియన్స్ కి గుర్తు చేసి ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాని దసరా కూడా అలాంటి సినిమానే.
అయితే చిన్న హీరోలే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేసింది లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఒక్కటే హిందీలో కూడా తెరకెక్కి, రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు మొదట్లో పాన్ ఇండియన్ ఫిల్మ్ అనుకోలేదు. ఆ తర్వాత పాన్ ఇండియన్ ఫిల్మ్ గా దాన్ని మార్చాల్సి వచ్చింది. కానీ తెలుగులో షూట్ చేసి దాన్ని వేరే భాషల్లోకి డబ్ చేస్తున్నట్లు అనుకోవాలి.
అయితే పవన్ ఇప్పుడు అసలైన పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయబోతున్నాడు. అంటే పవన్ కూడా అందరి దారిలోకి వచ్చాడన్నట్లే. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు మొదట్లో ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్ అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకున్నారు కానీ తర్వాత్తర్వాత అదే టైటిల్ అయిపోయింది. అన్నీ భాషల్లోనూ ఇదే టైటిల్‌తో సినిమా రాబోతుంది.
దీనికోసం ప్రొడ్యూసర్ దానయ్య అన్ని భాషల్లో టైటిల్స్‌ని రిజిస్టర్ కూడా చేయించాడట. రీసెంట్గా వినోదాయ సీతం రీమేక్ సినిమాలో తనకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన పవన్, ఏప్రిల్ 5నుంచి హరీష్ శంకర్‌తో సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా తర్వాత సుజీత్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పవన్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, ఎలక్షన్స్ పనిలోకి వెళ్లాలని చూస్తున్నాడు.













