25న పద్మావత్ విడుదల
పద్మావత్ చిత్రం జనవరి 25న విడుదల చేయనున్నట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటించింది. హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పద్మావతి టైటిల్‌ను పద్మావత్‌గా మార్చడంతోపాటు మరో నాలుగు షరతులు అంగీకరిస్తే యూ/ఏ సరిఫ్టికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సంసిద్ధత్య వ్యక్తం చేసిన విషయం విదితమే. సినిమా టైటిల్‌తో సహా మొత్తం అయిదు మార్పులు సూచించినట్లు సృష్టం చేశారు. సినిమా ప్రారంభంలో డిస్లైమర్ ప్రదర్శించటం, సతి ఆచారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని, గూమర్ పాటను మార్చాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.













