OTT: ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కష్టమే!
కరోనా తర్వాత వినోద పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ రంగంలో చాలానే మార్పులొచ్చాయి. అప్పటివరకు కేవలం థియేటర్లలో మాత్రమే కొత్త సినిమాలు చూసే తెలుగు ఆడియన్స్ ఓటీటీ(OTT)లో సినిమాలు చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ అలవాటు బాగా పెరిగిపోయింది. క్రైమ్, వయొలెన్స్, హార్రర్ సైకో కిల్లింగ్ లాంటి ఎన్నో జానర్లలో గత కొన్నాళ్లుగా చాలానే సినిమాలొచ్చాయి.
ఎలాంటి సెన్సార్ లేకుండా స్ట్రీమ్ అయ్యే ఈ తరహా కంటెంట్ చూసి పిల్లలు పాడైపోతున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో జరుగుతున్న మర్డర్లే దీనికి ఎగ్జాంపుల్. కూకట్‌పల్లిలోని టెన్త్ క్లాస్ బాలుడు ఓ అమ్మాయిని కత్తితో మర్డర్ చేయడం అందరినీ షాక్ కు గురించేసింది. అసలు పదో తరగతి అబ్బాయి అలా ఎలా మర్డర్ చేయగలిగాడని పోలీసులు అడగ్గా దానికి ఆ పిల్లాడు చెప్పిన ఆన్సర్ అందరినీ నివ్వెర పరిచింది.
ఓటీటీలోని క్రైమ్ థ్రిల్లర్లు చూసే తాను ఇదంతా ప్లాన్ చేశానని చెప్పాడు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి కానీ చిన్న పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవడం ఇదే మొదటిసారి. ఓటీటీలో క్రూరమైన వెబ్‌సిరీస్‌లు, కంటెంట్ కు ఎలాంటి అడ్డు లేకపోవడంతోనే పిల్లలు ఇలా తయారవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వాటిని నియంత్రించాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.







