సూపర్ ఫామ్‌లో కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్
ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కి అయినా కెరీర్ లో ఒక దశ దాటాక స్టార్ హీరోల సినిమాలు రావడం తగ్గుతాయి. ఆ విషయం గుర్తించగానే సదరు మ్యూజిక్ డైరెక్టర్స్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి దీనికి మినహాయింపుగా కనిపిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా రాజమౌళి సినిమాలకు తప్ప వేరే సినిమాలకు మంచి మ్యూజిక్ ఇవ్వడం లేదన్న కామెంట్స్ ఆయనపై వచ్చాయి.
అయినా సరే ఇప్పుడు స్టార్ హీరోలు కావాలని మరీ ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. దానికి తోడు నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చాక ఆయన క్రేజ్ మరింత పెరిగి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆయన చేతిలో పాన్ ఇండియా సినిమాలతో పాటూ తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
అందులో ఫస్ట్ మూవీ నాగార్జున-విజయ్ బిన్నీ కలయికలో వస్తున్న నా సామిరంగ సినిమా. నాగ్, కీరవాణి కలయికలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ రాగా, ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తర్వాత పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లుకు కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు.
ఫస్ట్ టైమ్ కీరవాణి పవన్ సినిమాకు వర్క్ చేస్తుండటంతో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా మెగాస్టార్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు. బింబిసార రీరికార్డింగ్‌కు వచ్చిన స్పందన చూసి కావాలని మరీ వశిష్ఠ, కీరవాణినే ఎంచుకున్నాడు. వీటన్నింటితో పాటూ మహేష్-రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న అడ్వెంచర్ ఫిల్మ్ కు కూడా కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్. చూస్తుంటే కీరవాణికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే అనుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో కీరవాణి దుమ్ముదులపడం ఖాయంగా కనిపిస్తోంది.













