Anuja: ఆస్కార్ కు అడుగు దూరంలో అనుజా
సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు కొన్ని సినిమాలు జీవితంలో ముందుకెళ్లడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఇండియా తరపున 97వ అకాడెమీ నామినేషన్లకు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అనుజా(Anuja) అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. ఆడమ్ జే గ్రేవ్స్(Ademn J Graves) దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్స్ లో బాల కార్మికులు, వారి జీవన పోరాటాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్.
చదువుకోవాలని విపరీతమైన కోరిక కలిగిన ఓ తొమ్మిదేళ్ల అమ్మాయి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఫ్యాక్టరీలో పనికి వెళ్తుంది. ఒకనొక టైమ్ లో అనుజాకి చదువుకునే ఛాన్స్ వస్తుంది. కానీ ఇంట్లో పరిస్థితి మాత్రం దానికి అనుకూలించదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుజా స్కూల్ లో జాయినైందా లేదా కుటుంబం కోసం వెనుకడుగేసిందా అనే దానిపై ఈ షార్ట్ ఫిల్మ్ ను తీశారు.
ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న షార్ట్ ఫిల్మ్ ను గునీత్ మోంగా(Guneetha Monga), సుచిత్రా మిట్టల్(Suchitra Mittal), మిండీ కాలింగ్(Mindi Colling) నిర్మించారు. అయితే గునీత్ మోంగా ఇప్పటికే రెండుసార్లు దేశం తరపున ఆస్కార్ వేదికపై నిలిచి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు అనుజాతో మరోసారి ఆ వేదికపై అడుగుపెట్టనున్న గునీత్, మరోసారి ఆస్కార్ గెలిచి హ్యాట్రిక్ అందుకుంటుందో లేదో చూడాలి.













