ఊరు పేరు భైరవకోన.. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!
ఆసక్తికరమైన మలుపులతో సాగే సీరియల్స్, ఆకట్టుకునే రియాలిటీ షోలతోనే కాకుండా వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్‌తో మీ ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. ఆసక్తికరమైన కథాంశంతో మిస్టరీ, అడ్వెంచరస్ హారర్ మూవీగా రూపొందిన ఊరు పేరు భైరవకోనజూన్ 30, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో, తప్పక చూడండి!
'ఊరు పేరు భైరవకోన' సినిమా కథ బసవ పాత్ర చుట్టూ తిరుగుతుంది.బసవ (సందీప్‌కిషన్) తనస్నేహితుడుజాన్ (వైవాహర్ష)తోకలిసిఓదొంగతనంచేస్తాడు. ఈక్రమంలో పోలీసులనుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. అయితే, ఈఇద్దరితో పాటు గీత ( కావ్యథాపర్) కూడా ఆఊర్లోకి వస్తుంది. ఇంతకీ, ఆభైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి?, అక్కడ కనిపించే మనుషులు ఎవరు? గరుడపురాణం లో కనపడకుండా పోయిన నాలుగు పేజీలకి భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే!
ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన, ఆకట్టుకునే కథాంశంతో ఫాంటసీ, డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు 'ఊరు పేరు భైరవకోన' సిద్ధమైంది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషించగా, వైవాహర్ష, వెన్నెలకిషోర్, పి. రవిశంకర్ఇతరకీలకపాత్రలుపోషించారు. ఈఎమోషనల్హారర్అండ్రివేంజ్డ్రామాని జీ తెలుగు వేదికగా మీరూ చూసేయండి!
థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మిస్టరీ.. ఊరు పేరు భైరవకోన ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!













