ఎన్టీఆర్‌కి జోడీ దొరికింది
విప్లవ యోధుడు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఆయనకు జోడీగా జెన్నిఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్ నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం, అల్లూరి కలిస్తే ఎలా ఉంటుందనే ఊహాజనిత కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఐరిష్ నటి అలిసన్, డూడీ, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ విలన్లుగా నటిస్తున్నారు. ఎ వ్యూ టు కిల్, ఇండియానా జోన్స్, లాస్ట్ క్రూసేడ్ లో అలిసన్ నటించారు. థోర్, కింగ్ ఆర్థర్‌లో రే స్టీవెన్ నటించారు. వచ్చే ఏడాది పది భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్ఆర్ఆర్ బృందం తెలిపింది.













