ఓ..! సుకుమారి’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో తిరువీర్
తిరువీర్, ఐశ్వర్య రాజేష్, భరత్ దర్శన్, మహేశ్వర రెడ్డి మూలి, గంగా ఎంటర్టైన్మెంట్స్ ‘ఓ..! సుకుమారి’ హిలేరియస్ టీజర్ లాంచ్
యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు. ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు తిరువీర్ . అలాంటి సమయంలో దామిని అనే అమ్మాయిని చూసిన వెంటనే ఆమెనే తన జీవిత భాగస్వామిగా భావించి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెడతాడు. అయితే ఆమె కుటుంబం ఆమెను తాకిన ఎవరికైనా విద్యుత్ షాక్ కొడుతుందనే ఒక విచిత్రమైన రహస్యాన్ని దాచిపెడుతుంది.
దర్శకుడు భరత్ ధర్షన్ గ్రామీణ వాతావరణం, స్థానిక రాజకీయాలు, వినూత్నమైన ట్విస్ట్‌ను తో వినోదభరితమైన కథను తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యాన్ని సినిమాటోగ్రాఫర్ సీహెచ్ కుషేందర్ అందమైన విజువల్స్‌తో ఆకట్టుకునేలా చూపించారు. భరత్ మంచిరాజు అందించిన సంగీతం టీజర్‌కు ఉత్సాహభరితమైన అనుభూతిని తీసుకొచ్చింది. బలగం ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా, క ఫేమ్ శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా, స్వయంభు ఫేమ్ అను రెడ్డి అక్కటి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పూర్ణాచారి పాటలు రాశారు.
తిరు వీర్ తన పాత్రలో సహజంగా ఒదిగిపోయి, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాజేష్ గ్రామీణ యువతిగా కనిపిస్తూ, తన పాత్రలో ఒక ఆసక్తికరమైన మలుపును తీసుకువచ్చారు. మురళీధర్ గౌడ్, మ్యాడ్ ఫేమ్ విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనంద్కోట జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మొత్తంగా టీజర్ వినోదం, ఆసక్తికరమైన కాన్సెప్ట్, హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో తిరు వీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా మా నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి థాంక్యూ. ఈ సినిమానే మమ్మల్ని ఎంచుకుందని నేను భావిస్తున్నాను. మసూద సినిమాను పిల్లలు, ఫ్యామిలీలు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీస్, పిల్లలు కలిసి చూసిన సినిమా చాలాకాలం గుర్తుండిపోతుంది. అలాంటి సినిమాలకు లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి విజయమే ఈ సినిమాకు దక్కుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. బెస్ట్ ప్రొడక్ట్ తీసుకురావడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు. ఐశ్వర్య గారితో ఇది నా రెండో సినిమా. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందం. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడూ కథే ముఖ్యం కథ బాగుంటే సినిమా ఆడుతుంది. ఈ సినిమాలో కూడా కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ఇదే. మహేశ్వర్ రెడ్డి గారు అద్భుతమైన నిర్మాత. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. కథను చాలా బాగా రాసుకున్నారు. హీరోయిన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేదనుకుంటాను. నిజానికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌ను ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపించేది. అలాంటి మనుషులు నిజంగానే ఉంటారా అనిపించేది. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఉంటారేమో అనిపించింది. కథతో చాలా కనెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మా టెక్నికల్ టీమ్, ఆర్టిస్టులందరికీ థాంక్యూ. ఈ సినిమా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో, ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తర్వాత మహేశ్వర్ రెడ్డి గారికి చాలా డబ్బులు రావాలని, ఆయనకు పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను. తిరు వీర్‌ను చూస్తుంటే మా నాన్నగారిని చూసినట్టే అనిపిస్తుంది. ఆయన చాలా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.
డైరెక్టర్ భరత్ దర్శన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా నిర్మాతకు, తిరు వీర్ అన్నకు, ఐశ్వర్య గారికి, అందరికీ థాంక్యూ వెరీ మచ్. టీజర్ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ ఇంకా అదిరిపోతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ కొత్తగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.
యాక్టర్ జీవన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
యాక్టర్ గవి రెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా. టీజర్ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఐశ్వర్య గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఎంచుకునే ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. ఈ సినిమా తర్వాత తిరు వీర్ గారి నుంచి నెక్స్ట్ లెవెల్ సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్యూ.
డీవోపీ కుషేందర్ మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది హై వోల్టేజ్ బ్లాక్‌బస్టర్ సినిమా. కంటెంట్ విన్నప్పటి నుంచే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐశ్వర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే మా డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.








